బాధితులకు అండగా నిలవాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలు, పరిశ్రమలు, దాబాలు, పెట్రోల్ బంక్‌లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అవగాహన కల్పించాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. అనంతరం తూప్రాన్ పట్టణంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లీకూతురిని సకాలంలో స్పందించి రక్షించిన తూప్రాన్ పోలీస్ కానిస్టేబుళ్లు రవి, శ్రీకాంత్‌ను అభినందించారు. క్యాష్ రివార్డుతో పాటు ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఇదిలాఉండగా ఎస్పీ శ్రీనివాసరావుకు సీనియర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్‌శాఖ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 496 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బందోబస్తును కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. జాతరకు వ చ్చే భక్తులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, పార్కింగ్‌కు కేటాయించిన స్థలాల్లోనే నిలపాలని సూచించారు. ఆకతాయిల నియంత్రణ కోసం షీ టీమ్‌లు, మఫ్టీ పార్టీలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట అద నపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, రంగా నాయక్, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది ఉన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావును సన్మానిస్తున్న పోలీస్ అధికారులు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


