ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోండి
హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్‌కలెక్టరేట్: రైతుల పొట్టగొట్టే విధంగా ఇసుక అక్రమ తరలిస్తుంటే అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మండలం సంగాయిగూడ తండాలోని హల్దీవాగును పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇసుక తరలించడం వల్ల ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తు న్న ముఠాకు అధికారుల అండదండలు ఉండటం విడ్డూరంగా ఉందని వాపోయారు. ఇప్పటికై నా వా రిపైన చర్యలు తీసుకొని రైతుల పంట పొలాలకు సాగు నీరందించే విధంగా చూడాలని కోరా రు. అనంతరం పద్మారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను కలిశారు. అధికార పార్టీ నాయకులు 45 రోజులుగా ఇసుకను అక్రమంగా జహీరాబాద్, బీ దర్, హైదరాబాద్ తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి


