మెరుగైన ఫలితాలు సాధించాలి
కొల్చారం(నర్సాపూర్): పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే లా నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, ఉపాధ్యాయులు, విద్యార్థుల స ంఖ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యాబోధన అందించడంతో పాటు సమయానికి నాణ్యమైన ఆ హార పదార్థాలను అందించాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తరగతి గదులు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం రేవతిదేవి, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్‌రాజ్
కలెక్టర్ రాహుల్‌రాజ్


