
చినుకు పడితే అంతే..
ప్రతీ వర్షాకాలం ఇబ్బందులే..
● మూడు కాలనీలకు తప్పని ముంపు
● ఇళ్లలోకి వస్తున్న వరదతో
పట్టణ వాసుల అవస్థలు
● పట్టించుకోని అధికారులు
రామాయంపేట(మెదక్): రామాయంపేట ము న్సిపాలిటీ పరిధిలో చిన్నపాటి వర్షం పడినా, మూడు కాలనీలకు ముంపు తప్పడం లేదు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో శ్రీనగర్‌కాలనీతో పాటు అక్కల బస్తీ, బీసీ కాలనీలు జలమయం అయ్యాయి. మురుగు నీరు నేరుగా ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దుస్తులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి నీటితో తడిసిపోయాయి. ఈవిషయమై గతంలో తాము పలుమార్లు ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని అక్కలబస్తీ వాసులు వాపోయారు. రెండు రోజల పాటు నిద్రలేకుండా గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లె చెరువును ఆనుకొని శ్రీనగర్ కాలనీలో ఇళ్లు నిర్మించుకోగా, చెరువు నిండినప్పుడల్లా వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. పాములు, పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు మురుగు కాలువల సదుపాయం సరిగా లేకపోవడంతో వరద నీరు నేరుగా ఇళ్లలోకే వస్తుందని చెబుతున్నారు.
ఇంటిలోకి ప్రవేశించిన వరద నీరు
ఇళ్లలోకి మురుగు నీరు
చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నేరుగా ఇళ్లలోకే చేరుతోంది. కాలనీలో రోడ్లు, మురికి కాలువలు సక్రమంగా నిర్మించకపోవడంతో ప్రతీసారి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. అధికారులు తమకు న్యాయం చేయాలి.
– పుట్టి సత్తవ్వ, అక్కలగల్లీ
వర్షం వస్తుందంటే భయం
1రద నీరు ఇళ్లలోకి రాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. వర్షం వస్తుందంటేనే తాము భయాందోళన చెందుతున్నాం. ఇప్పటికే చాలా ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– బీర అనసూయ, రామాయంపేట
పాపన్నపేట: 16 రోజులుగా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. అమ్మవారి ఆలయంలోకి భక్తులు వెళ్లడానికి వీలు లేకపోవడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

చినుకు పడితే అంతే..

చినుకు పడితే అంతే..

చినుకు పడితే అంతే..

చినుకు పడితే అంతే..