
సిద్దిపేట జిల్లా కోహెడలో ఘటన
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్): గణపతి నవరాత్రులు వచ్చాయంటే పూజారులకు క్షణం తీరిక ఉండదు. పూజల కోసం ప్రజలు ముందుగానే పూజారులతో మాట్లాడుకుంటారు. ఒక్కో పూజారి నాలుగైదు మంటపాల వద్ద గణపతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, తమ మంటపంలో పూజలు చేయటానికి పూజారి దొరక్కపోవటంతో కొందరు యువకులు ఓ పూజారిని ఎత్తుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడలో చోటుచేసుకుంది.
హుస్నాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద బుధవారం పూజ పూర్తయిన వెంటనే విశ్వబ్రాహ్మణ కాలనీ, పోచమ్మ కాలనీ, గ్రామ పంచాయతీ కాలనీ, ధర్మసాగర్‌పల్లి తదితర ప్రాంతాల యువకులు ఒకేసారి వచ్చి తమ పంటపం వద్ద పూజ చేయాలని పూజారి కనకయ్యను చుట్టుముట్టారు. పోటీ పెరగటంతో యువకుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ కాలనీకి చెందిన యువకులు పూజారిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
..… pic.twitter.com/uV4lsMUj3u
— Telugu Reporter (@TeluguReporter_) August 29, 2025