ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు

Aug 30 2025 8:58 AM | Updated on Aug 30 2025 10:16 AM

ముంపు

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు

పారిశుద్ధ్య పనులు తప్పనిసరి నేడు భగీరథ నీరు బంద్‌

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

హవేళిఘణాపూర్‌(మెదక్‌)/మెదక్‌ కలెక్టరేట్‌: ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందకు చర్యలు ముమ్మరం చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని సర్దన, పోచమ్మరాళ్‌, బూర్గుపల్లిలో ఆయన పర్యటించారు. కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల పరిధిలోని సర్దన గ్రామస్తులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులు అందుబాటులో ఉండి సేవలందిస్తారని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. బూర్గుపల్లిలో చెరువు వద్ద గల బ్రిడ్జి కొట్టుకుపోగా తాత్కాలికంగా మొరం పోసి రాకపోకలు సాగేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సింధూరేణుక, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ఉన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో అన్ని చెరువులు పొంగిపొర్లుతున్నాయని, వినాయక నిమజ్జనం సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సూచించారు.

బాధితులను ఆదుకోండి

రామాయంపేట(మెదక్‌): జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కాట్రియాలతో పాటు పలు గిరిజన తండాల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన తండాల్లో తాగు నీటితో పాటు కరెంటు సరఫరా బంద్‌ కావడంతో ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. బాధితులను ప్రభు త్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె వెంట సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, పార్టీ యూత్‌ విభాగం మండలాధ్యక్షుడు జలంధర్‌, మాజీ సర్పంచ్‌లు శ్యాం, సుభాశ్‌నాయక్‌, నాయకులు స్వామి, కిషన్‌, భిక్షపతి ఉన్నారు.

యూరియా కోసం

తప్పని తిప్పలు

నర్సాపూర్‌: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తమ గ్రామాల నుంచి రోజూ నర్సాపూర్‌ వచ్చి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద టోకెన్ల కోసం బారులు తీరడం నిత్యకృత్యం అయింది. శుక్రవారం యూరియా వస్తుందని తెలిసి ఉదయం నుంచే సొసైటీ వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం తర్వాత యూరియా రాగానే తలా ఒక బస్తా తీసుకొని వెళ్లారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): భారీ వర్షాలతో గ్రామా ల్లో సంపూర్ణ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డీఎల్‌పీఓ సాయిబాబ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎక్కడా సమస్య లేకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మురికి కాలువ లు, రోడ్డు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్‌ ఉన్నారు.

నర్సాపూర్‌: మిషన్‌ భగీరథ నీరు శనివారం రావని ఏఈ రాజ్‌కుమార్‌ తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని బోర్పట్ల నీటి శుద్ధి కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో నీటి శుద్ధి నిలిచిపోయిందని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు 
1
1/2

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు 
2
2/2

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement