
వంతెన చిన్నది.. వాగు పెద్దది
గన్నేరువాగు ఉధృతితో
44వ జాతీయ రహదారికి ముప్పు
పదేళ్ల క్రితం ఇదే పరిస్థితి.. అయినా తేరుకోని అధికారులు
జాతీయ రహదారికి మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
చిన్నశంకరంపేట(మెదక్): కశ్మీర్ టూ కన్యాకుమారి వెళ్లే 44వ జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణం చేపట్టకపోవడంతో నార్సింగి మండల కేంద్రంలో వరద ఉధృతికి ముప్పు ఏర్పడుతుంది. వల్లభాపూర్ ధర్మారం గుట్టల నుంచి జాతీయ రహదారి మీదుగా శేరిపల్లి గుండు చెరువుకు వెళ్లే గన్నేరువాగు వరదను అంచనా వేయడంలో హైవే అథారిటీ అధికారులు విఫలమయ్యారు. నాలుగు వరుసల జాతీ య రహదారి నిర్మాణ సమయంలో గన్నేరువాగు వరద ఉధృతికి అనువుగా వంతెనను నిర్మించకపోవడంతో భారీ వర్షం వచ్చినప్పుడల్లా 300 మీ టర్ల పొడవునా వరద ప్రవహిస్తోంది. పదేళ్ల క్రితం ఇదే స్థాయిలో గన్నేరువాగు పొంగిపొర్లడంతో వా హనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్పుడే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు.