
16 వేల ఎకరాల్లో పంటలకు నష్టం
జిల్లావ్యాప్తంగా 16,230 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ముంపునకు గురయ్యాయి. వాటిలో ఇసుక మేటలు పేరుకుపోగా, మరికొన్ని వరదలోనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వరి 13,214 ఎకరాలు ఉండగా, పత్తి 2,284 ఎకరాలు.. మరో 732 ఎకరాల్లో ఆరుతడి పంటలు ఉన్నాయి. కాగా ఇందులో అత్యధికంగా హవేళిఘణాపూర్, నిజాంపేట, పాపన్నపేట మండలాల్లో వరి పంటలు దెబ్బతినగా, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాల్లో పత్తికి నష్టం జరిగింది. కాగా దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
శివ్వంపేట: నీటి మునిగిన వరి పంట