
వరద తెచ్చిన.. బురద కష్టాలు
మెదక్ మున్సిపాలిటీ: భారీ వర్షాలకు పట్టణంలోని ప లు ఇళ్లు, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. పట్టణంలోని ఫతేనగర్, సాయినగర్, వెంకట్రావునగర్ కాలనీల్లో మురికి కాల్వలు నిండి రోడ్లపైకి రావడంతో జలమయం అయ్యాయి. గాంధీనగర్ వీధిలో అక్కడక్కడ ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. కాగా శుక్రవారం వర్షం తగ్గడంతో మెదక్‌లోని ప లు చోట్ల పునరావాసం పొందుతున్న ప్రజలను పోలీసులు తమ గ్రామాలకు బస్సుల్లో తరలించారు. దీంతో వారు ఇంట్లోకి చేరిన నీటిని బయటకు తోడుతూ శుభ్రం చేసుకుంటున్నారు.

వరద తెచ్చిన.. బురద కష్టాలు