
తక్షణ సాయం అందజేయాలి
కొల్చారం(నర్సాపూర్): భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మంజీరాలో గల్లంతైన టేక్మాల్ ప్రమీల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి సంగాయిపేట, వరిగుంతం గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలు, చెరువులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రమీల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. జిల్లాకు తక్షణ సహాయం కింద రూ. కోటి ప్రకటించారని, అవి ఏం సరిపోతాయని ప్రశ్నించారు. ఆమె వెంట డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మేఘమాల, నాయకులు గౌరీశంకర్ తదితరులు ఉన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి