
నానోతో అధిక ప్రయోజనాలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): నానో యూరియాతో రైతులకు అధిక ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సోమక్కపేట్ పీఏసీఎస్‌లో రికార్డులను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ సిబ్బందితో కలిసి గ్రామ శివారులో వరి పంటలను పరిశీలించారు. రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నానో యూరియా అనేది మొక్కల అవసరాలకు అనుగుణంగా నత్రజనిని అందించే ద్రవరూప ఎరువు అన్నారు. పోషకాలు నేరుగా మొక్కలలోకి వెళ్లడంతో దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుందన్నారు. నేల సారవంతమవడంతో పాటు, పర్యావరణ కాలు ష్యం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్, ఏఈఓలు కృష్ణవేణి, అనిత, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది రాజు, నర్సింలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
డీఏఓ దేవ్‌కుమార్