
సైబర్ మోసాల పట్ల జర భద్రం
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇటీవల జిల్లాలో జరిగిన సైబర్ నేరాలను వివరించారు. ముందుగా తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాధితుడు ఇన్‌స్ట్రాగాంలో ప్రకటన చూసి మేనేజ్ చేయగా.. వెంటనే అతడి వాట్సాప్‌కు మోసగాళ్లు ఒక లింక్ పంపి నకిలీ ప్లాట్‌ఫాం ద్వారా పెట్టుబడి పెట్టించారు. మొదట్లో లాభాలు చూపించి రూ. 15 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పి ంచారు. దీంతో బాధితుడు సైబర్ మోసగాళ్లను నమ్మి దాదాపు రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత తన పెట్టుబడి వెనక్కి తీసుకునే యత్నం చేయగా డబ్బులు రాలేదు. పైగా మరో రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టాలని చెప్పడంతో బాధితుడు వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. పెద్దశంకరంపేటకు చెందిన మరో బాధితుడికి ధని, ముద్రలోన్ రూ. 2 లక్షల లోన్ మంజూరైనట్లు నమ్మించారు. సాకులు చెబుతూ రూ. 57 వేలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు