కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపా రు. బుధవారం మండలంలోని మహమ్మద్‌నగర్ శివారులో వరి పొలాలను పరిశీలించారు. వరి పంటకు ఇంకా ఎన్ని నీటి తుడులు అవసరం, ఎన్నిరోజులకు కోతకు వస్తుంది. దిగుబడి అంచనా, బోరు బావుల్లో ప్రస్తుత నీటి లభ్యత.. తదితర విషయాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి వనరులకు అనుగుణంగా పంటను సాగు చేయాలని చెప్పారు. వచ్చే యాసంగి సీజన్‌లో అయిన బోరుబావిలో నీటి లభ్యత ఆధారంగా రైతులు పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశా రు. రిజిస్ట్రేషన్లు సరిగా చేయాలని, రికార్డులు సక్రమంగా భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్‌ఐ శ్రీహరి, సర్వేయర్ మొగులయ్య రైతులు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్