ఓవరాల్ ఛాంపియన్ అల్గోల్
ముగిసిన జిల్లా స్పోర్ట్స్ మీట్
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మైనార్టీ గురుకులాల జిల్లా స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లా లోని 8 టిమ్రేస్ పాఠశాలలకు చెందిన 800 మంది విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు అండర్ 14, 17, 19 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. అండర్ 14 ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా సిద్దిపేట, అండర్ 17 ఓవరాల్ ఛాంపియన్ షిప్‌గా సంగారెడ్డి, అండర్ 19 ఓవరాల్ ఛాంపియన్ షిప్‌గా అలో ల్ టీంలు నిలిచాయి. క్రీడా పోటీల ఓవరాల్ ఛాంపియన్‌గా అల్గోల్ నిలిచింది. వీరికి జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్, టౌన్ ఎస్‌ఐ వినయ్‌కుమార్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ షహనాజ్ బేగం, కళాశాల ప్రిన్సిపాల్ జమీల్, జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ప్రశాంత్‌గౌడ్, పీఈటీ అనిల్‌కుమార్‌తో పాటు జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాల్స్, పీఈటీలు పాల్గొన్నారు.


