కళకళలాడుతున్న పల్లెలు
కొత్త పాలకవర్గాలు కొలువుదీరబోతు న్న వేళ.. గ్రామ పంచాయతీ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. పలు గ్రామాల్లో కా ర్యాలయాలకు రంగులు వేశారు. కొబ్బరిమట్టలు, మామిడి తోరణాలు, లైట్ల తో అలంకరించి గ్రామస్తులను పట్టాభిషేకానికి ఆహ్వానించారు. కొన్ని గ్రామాల్లో స్వీట్లు, భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరికొందరు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త సర్ప ంచ్‌లు తమ అభిరుచికి అనుగుణంగా, కొత్త ఫర్నిచర్ తెచ్చుకుంటున్నారు. శివ్వంపేట మండలంలోని తిమ్మాపూర్‌లో పంచాయతీ భవనానికి పింక్ కలర్ వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చేగుంట, పాపన్నపేటలో ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.


