దుర్గమ్మా.. దీవించమ్మా | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మా.. దీవించమ్మా

Dec 22 2025 8:49 AM | Updated on Dec 22 2025 8:49 AM

దుర్గ

దుర్గమ్మా.. దీవించమ్మా

దుర్గమ్మా.. దీవించమ్మా 4,248 కేసుల పరిష్కారం రాజీయే రాజమార్గం కాంగ్రెస్‌లోకి కొంగోడ్‌ సర్పంచ్‌ జాతరలు మన సంస్కృతికి ప్రతీకలు

పాపన్నపేట(మెదక్‌): దుర్గమ్మా.. మమ్ము దీవించమ్మా అంటూ వేలాది భక్తులు ఆదివారం ఏడుపాయల వన దుర్గమ్మను వేడుకున్నారు. ఉదయం అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి బోనాలు తీసి, ఒడి బియ్యం పోసి భక్తులు మొక్కులు తీర్చుకున్నా రు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సంగారెడ్డి టౌన్‌: రాజీమార్గంతో కేసులు పరిష్కారం చేసుకోవచ్చని సంగారెడ్డి జిల్లా కోర్టు ఇన్‌చార్జి జయంతి అన్నారు. ఆదివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకున్నారని, కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో వెళ్లే కేసులను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 4,248 కేసులు పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, డబ్బు, విలువైన సమయాన్ని వృథా చేసుకోవటం కంటే రాజీమార్గమే ఇరువర్గాలకు ఎంతో మంచిదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. లోక్‌ అదాలత్‌లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 3,398 కేసులు రాజీ పడటం సంతోషకరమైన విషయం అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లోక్‌ అదాలత్‌ ద్వారా చిన్నపాటి కేసులను రాజీ చేస్తున్నామని, దీనిని ప్రజలు ఉప యోగించుకోవటం సంతోషంగా ఉందన్నారు.

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని కొంగోడ్‌ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సర్పంచ్‌ దుబ్బగళ్ల స్వామి ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. నర్సాపూర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌, కొల్చారం సర్పంచ్‌ శేఖర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు సామెల్‌, కుమార్‌ గౌడ్‌, దుర్గాగౌడ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

పటాన్‌చెరు: తెలంగాణలో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముత్తంగి పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన మల్లన్నస్వామి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ:సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్‌, దేవానందం, మాజీ వైస్‌ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ ఉపేందర్‌, సందీప్‌, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

దుర్గమ్మా.. దీవించమ్మా 
1
1/4

దుర్గమ్మా.. దీవించమ్మా

దుర్గమ్మా.. దీవించమ్మా 
2
2/4

దుర్గమ్మా.. దీవించమ్మా

దుర్గమ్మా.. దీవించమ్మా 
3
3/4

దుర్గమ్మా.. దీవించమ్మా

దుర్గమ్మా.. దీవించమ్మా 
4
4/4

దుర్గమ్మా.. దీవించమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement