జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్
మెదక్‌జోన్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం జిల్లా కేంద్రంలోని అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి మూడవ తరగతి చదువుతున్న 31 మంది విద్యార్థులు సెలక్షన్‌కు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేశ్ మీడియాకు వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయిక్రీడలకు ఎంపిక చేస్తారని, వారు ఏప్రిల్ 27 నుంచి హకీంపేటలో కొనసాగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రావు, మాధవరెడ్డి, మధుసూదన్, శ్యాం, దేవేందర్‌రెడ్డి, రవి, ప్రదీప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


