మీసేవ చార్జీల పెంపు | - | Sakshi
Sakshi News home page

మీసేవ చార్జీల పెంపు

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

అదనపు

కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: తమ కనీస చార్జీల పెంపు కోసం మీసేవ నిర్వాహకులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న వేళ వారి కల నెరవేరింది. మీసేవ నిర్వాహకుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరల పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఈ విషయమై బుధవారం రాత్రి అదనపు కలెక్టర్‌ నగేశ్‌వెల్లడించారు. ఇప్పటివరకు రూ. 35 ఉన్న కనీస చార్జీని రూ. 62కు పెంచినట్లు తెలిపారు. కేటగిరీల వారీగా చార్జీల పెంపు జరిగినట్లు చెప్పారు. మెయింటెనెన్స్‌ డేలో భాగంగా ఈనెల 3న మీ సేవ కేంద్రాలు పనిచేయవని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement