కొండెక్కిన కోడి ధర
వారంలో రూ. 50 పెరుగుదల
సదాశివపేట(సంగారెడ్డి): కోడి కొండెక్కింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కిలోపై రూ. 50 పెరిగింది. దీంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటి నుంచి ధరలు పెరగడం ప్రారంభం అయింది. వారం వారం రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచుతున్నారు. గత వారం క్రితం లైవ్ రూ. 130, డ్రెస్‌డ్ చికెన్ రూ. 200 నుంచి రూ. 240 పలకగా, ప్రస్తుతం లైవ్ రూ. 160, డ్రెస్‌డ్ రూ. 270, స్కిన్‌లెస్ రూ. 300 పలుకుతోంది. కిలోపై రూ. 50 మేర పెరిగింది. అయితే దీనికి కారణం కోళ్ల రేటు పెరగటమేనని వ్యాపారులు చెబుతున్నా రు. గతంలో కోళ్లు జిల్లాలోనే అందుబా టులో ఉండేవని, దీంతో ధరలు తక్కువగా ఉండేవంటున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందంటున్నారు. రవాణా చార్జీలు తడిసి మోపడవుతుండటంతో చికెన్ రేటు పెరిగిందని చెబుతున్నారు.


