'పెన్షన్‌లు కాదు.. నౌకర్లు కావాలి' : ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు

- - Sakshi

పేదల పక్షాన పోరాడుతున్నా..

ఆశీర్వదించండి దుబ్బాక బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు!

సాక్షి, మెదక్‌: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచించాలని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు.

అలాగే దౌల్తాబాద్‌, తొగుట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతాయి తప్పా ప్రభుత్వాలు ఇచ్చే స్వార్థపూరిత కానుకలతో కాదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తప్పకుండా సాగనంపుతారన్నారు.

కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దు!
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌ కల్లబొల్లి మాటలు, కథలు చెబుతున్నాడని.. వాటిని ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని రఘునందన్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

మరోసారి ఆశీర్వదించండి..
పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల తరఫున పోరాడుతున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని రఘునందన్‌రావు కోరారు. నిరుద్యోగులు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏ, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, వారితో కలిసి ధర్నాలు, ఆందోళనలు ప్రత్యక్షంగా చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో సైతం పేదలు, నిరుద్యోగులతో పాటు చాలా సమస్యలపై గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. ప్రశ్నించే గొంతుకను.. కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు.

దుబ్బాక అభివృద్ధి కోసమే నా తపన..
‘దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా తపన, ఆవేదన, ఆకాంక్ష’ అని రఘునందన్‌రావు అన్నారు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి న్యాయపరంగా దక్కాల్సిన నిధులు వచ్చేలా పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందో.. అభివృద్ధి ఎలా పరుగెత్తింతో గమనించి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సారి దుబ్బాకను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు.

బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే ఆగమవుతాం!
దుబ్బాక ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి ఆగం కావద్దని మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం మాచిన్‌పల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి గ్రామాలతో పాటు తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, కాన్గల్‌, గుడికందుల గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు.

ఇంటింటి ప్రచారం!
చేగుంటతో పాటు రుక్మాపూర్‌ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఉపసర్పంచ్‌ రాంచంద్రం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మ్యాకల రమేశ్‌, బాలరాజు, నవీన్‌, స్వామి, ముత్యం, సిద్దిరాములు, శ్రీరాం సిద్దిరాంలు, గణేష్‌, లావణ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: 'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

21-11-2023
Nov 21, 2023, 09:04 IST
సాక్షి, మెదక్‌: తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన తండాల అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని...
21-11-2023
Nov 21, 2023, 08:58 IST
సాక్షి, మెదక్‌: శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఆయా రాజకీయ పార్టీల్లో నేతల వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన...
21-11-2023
Nov 21, 2023, 08:00 IST
జడ్చర్ల టౌన్‌: ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచినా రికార్డు నమోదవుతుంది. 1962లో జడ్చర్ల నియోజకవర్గం...
21-11-2023
Nov 21, 2023, 05:02 IST
కాంగ్రెస్‌తో 58 ఏళ్లు గోసపడ్డం.. ఆ రాజ్యం మళ్లీ కావాలా? వాళ్లది ‘భూమేత’.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం ఎన్నికలు కాగానే ఆర్టీసీ...
21-11-2023
Nov 21, 2023, 04:41 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున డిసెంబర్‌ నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో...
21-11-2023
Nov 21, 2023, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఆ పార్టీ ప్రజల రక్తం తాగిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర...
21-11-2023
Nov 21, 2023, 04:22 IST
సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్‌బీనగర్‌/మన్సూరాబాద్‌: ‘కాంగ్రెస్‌ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ శాఖ...
21-11-2023
Nov 21, 2023, 04:15 IST
నర్సాపూర్‌ /పరకాల/బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం కాదని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే రాజ్యమని...
21-11-2023
Nov 21, 2023, 04:11 IST
గజ్వేల్‌/దుబ్బాకటౌన్‌: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్‌టీ వేసి, గ్యాస్‌ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని...
21-11-2023
Nov 21, 2023, 04:07 IST
జనగామ/కోరుట్ల/మెట్‌పల్లి/మల్లాపూర్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో మిషన్‌ పథకాలన్నీ కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల స్కీంలుగా మారిపోయాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి...
20-11-2023
Nov 20, 2023, 16:13 IST
సాక్షి,నర్సాపూర్‌ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ...
20-11-2023
Nov 20, 2023, 15:48 IST
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాంగ్రెస్‌ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్‌ తీసుకొస్తారట కాంగ్రెస్‌ వాళ్లు తెచ్చేది భూమాత...
20-11-2023
Nov 20, 2023, 13:53 IST
ఖమ్మంలో రెండు సామాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
20-11-2023
Nov 20, 2023, 13:34 IST
సాక్షి, కామారెడ్డి: దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాతముఖాలే కనిపించేవి. గెలిచినా, ఓడినా వాళ్లే బరిలో ఉండేవారు....
20-11-2023
Nov 20, 2023, 13:19 IST
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు...
20-11-2023
Nov 20, 2023, 12:54 IST
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ...
20-11-2023
Nov 20, 2023, 12:18 IST
నిర్మల్‌/ఖానాపూర్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘కుమురంభీమ్, రాంజీగోండు, సమ్మక్క–సారలమ్మ లాంటి వీరుల భూమి ఇది. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన గడ్డ...
20-11-2023
Nov 20, 2023, 11:26 IST
రూపురేఖలు మార్చే ఎన్నికలివి.. ‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో...
20-11-2023
Nov 20, 2023, 10:43 IST
నాగర్‌కర్నూల్‌/అలంపూర్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
20-11-2023
Nov 20, 2023, 09:45 IST
జహీరాబాద్‌: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎం.బాగారెడ్డి,... 

Read also in:
Back to Top