రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Mar 15 2026 6:43 AM | Updated on Mar 15 2026 6:43 AM

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన ఆ కుల సారిక రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికై ంది. గతనెల 16 నుంచి 19 వరకు సిరిసిల్లలో జరిగిన పోటీలలో ప్రతిభ చూపింది. శనివారం బాలికను గ్రామస్తులు అభినందించారు. ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో సైతం రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావా లని వారు ఆకాంక్షించారు.

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని 2, 3, 30, 31 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఎమ్మెల్యేకు వినతి

శివ్వంపేట(నర్సాపూర్‌): ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) నాయకులు ఎమ్మెల్యే సునీతారెడ్డిని కోరారు. ఈ మే రకు శనివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ తదితర సమస్యల గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement