నేరస్తులు ఊచలు లెక్కించాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

నేరస్తులు ఊచలు లెక్కించాల్సిందే..!

Nov 21 2026 12:08 AM | Updated on Nov 21 2026 12:08 AM

● శిక్ష పడేలా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ ● పది నెలలు.. 76 కేసుల్లో 112మందికి శిక్ష

మంచిర్యాలక్రైం: నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోకుండా రామగుండం పోలీసు కమిషనరేట్‌ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. సరైన సాక్ష్యాధారాలు సేకరిస్తూ నిందితులకు శిక్ష పడేలా చూస్తున్నారు. దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, పోక్సో, నేరం ఏదైనా పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేరస్తులకు శిక్ష పడితేనే పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందనే భావనతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాసీ్త్రయంగా ముందుకెళ్తున్నారు. ఇటు పోలీసుశాఖలోని సిబ్బంది క్రమశిక్షణ తప్పకుండా పనిష్‌మెంట్లు, సస్పెండ్‌లు, బదిలీల వేటు వేస్తున్నారు. కేసు దర్యాప్తు నుంచి తుది తీర్పు వెలువడే వరకు ప్రతీ దశను కీలకంగా భావిస్తూ పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు పది నెలల కాలంలో 76వివిధ రకాల కేసుల్లో 112మందికి న్యాయస్థానం శిక్షలు విధించింది. వీటిలో ప్రధానంగా ఎనిమిది కేసుల్లో ఎనిమిది మందికి జీవిత ఖైదు, రూ.55వేలు జరిమానా, రెండు కేసుల్లో ఐదుగురికి 20ఏళ్ల జైలు, రూ.21వేలు జరిమానా, ఒక కేసులో ఒకరికి 12ఏళ్ల జైలు, రూ.2లక్షల జరిమానా, తొమ్మిది కేసుల్లో 10మందికి పదేళ్ల జైలు, రూ.90వేలు జరిమానా, వీటితోపాటు మరికొన్ని కేసుల్లో నేరస్తులకు జైలు శిక్ష, జరిమానా పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement