షరతులతోనే అమలు | - | Sakshi
Sakshi News home page

షరతులతోనే అమలు

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

తీవ్రంగా కరువు ఉన్న జిల్లాల్లో మారటోరియం గడువు మరింత ఎక్కువగా ఉండగా.. జిల్లాలో కరువు తీవ్రత తక్కువగా ఉండడంతో రైతులకు అప్పుల నుంచి తాతాల్కిక ఉపశమనం కానుంది. మరోవైపు షరతులతోనే ఈ మారటోరియం అమలు కానుంది. రైతులు పంట రుణాలు తీసుకుని ఓవర్‌ డ్యూ అయి ఉండకూడదు. రుణాలు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. ఎవరైనా చెల్లించే అవకాశం ఉంటే రుణం కట్టి మళ్లీ తీసుకోవచ్చు. ఎవరైనా రైతులు కట్టలేని స్థితిలో ఉంటే ఈ వెసులుబాటు పొందవచ్చు. ఇది పూర్తిగా రుణమాఫీ కాకుండా కేవలం రుణ చెల్లింపు కాలాన్ని వాయిదా వేయడమే తప్ప ఎలాంటి మాఫీ ఉండదు. తదుపరి సీజన్‌, ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. కరువు నేపథ్యంలో రైతులకు రుణాలు గడువులోపు కట్టకుండా తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇదే తరహాలో కోవిడ్‌ సంక్షోభ సమయంలో బ్యాంకుల్లో చెల్లించాల్సిన మొత్తంపై తాత్కాలికంగా నిలిపివేస్తూ వీలు కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement