ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కవ నీటి అవసరం ఉండే ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. శనివారం ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్‌, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి, ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌భాష ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో యాసంగి పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ అంశాలపై హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని గుడిపేట రైతువేదికలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, వ్యవసాయ శాఖ ఏడీలు మామిడి కృష్ణ, గోపి, డివిజన్‌లోని ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, శనగ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, కూరగాయలు సాగు చేయాలని అన్నారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపా టు రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించేలా ముందస్తు పంటల ప్రణాళిక రూపొందిచుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement