భూగర్భ జలాలు పెంచుకోవడమే మార్గం | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలు పెంచుకోవడమే మార్గం

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

కాసిపేట: ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలంటే భూగర్భ జలాలను పెంచుకోవడం ఒక్కటే మార్గమని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలకు నిర్ధేశించిన ఇంకుడుగుంత, బోర్‌వెల్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్‌ లక్ష్యం సాధించాలని డీఎల్‌పీవో సతీష్‌కుమార్‌ సూచించారు. శనివారం మండలంలోని పల్లంగూడలో జలసిరి కార్యక్రమంలో భాగంగా సామూహిక, ఇంటింటి ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్‌, పారి శుద్ధ్య పనులు పరిశీలించారు. కోమటిచేను గ్రామ పంచాయతీలో వీవో భవన నిర్మాణ పనులు సందర్శించారు. జలసిరి పనుల మంజూరు తీర్మానాలు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంపీవో షేక్‌ సబ్ధర్‌ అలీ, సర్పంచ్‌ దుస్స విజయ, పంచా యతీ కార్యదర్శులు శ్రీధర్‌, ఉదయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement