పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ అధ్యక్షుడు మంచర్ల సదానందం డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎదునూరి రమేశ్, రామస్వామి, గొడిశెల సురేందర్, మేడి రాజు, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.


