జైపూర్/జ్యోతినగర్: మంచిర్యాల జిల్లా ఇందారం అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన అనురాధ త్రివేది (62) మృతి చెందినట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు. ఎన్టీపీసీకి చెందిన అనురాధ ఆమె భర్త రామ్‌ప్రసాద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై గోదావరిఖని నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన అనురాధ త్రివేది ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. ఆమె భర్త వేణుగోపాల్ త్రివేది ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ లయన్స్ క్లబ్‌లో ప్రముఖుడిగా కొనసాగుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


