కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

మందమర్రిరూరల్‌: కార్మికుల హక్కుల సాధనే ఏఐటీయూసీ లక్ష్యమని యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం ఏరియాలోని కేకే–5 గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల 32 సమస్యల పరిష్కారానికి గత నెలలో యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చల్లో 23 సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఇది కార్మిక విజయంగా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న గుర్తింపు కార్మిక సంఘం కార్మిక హక్కులను పట్టించుకోలేదని ఆరోపించారు. అలాంటి సంఘం నాయకులు అవగాహన లేకుండా ఏఐటీయూసీపై ఆరోపణలు చేస్తున్నారని, వారికి కార్మిక వర్గం తగిన రీతిలో బుద్ది చెబుతుందన్నారు. సమావేశంలో ఆ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సుదర్శన్‌, శ్రీనివాస్‌, సంపత్‌, రాజేశం, సీవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement