జైపూర్: ఇందారం ఐకే ఓపెన్‌కాస్టును గురువారం సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె.వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్‌తో కలిసి గని అధికారులతో ఉత్పత్తి, ఉత్పాదకతపై సమీక్షించారు. అనంతరం గనిలోని పనులను పరిశీలించారు. వర్షాలు, కాంట్రాక్టు సమస్యలతో వెనుకబడిన ఉత్పత్తిని ప్రణాళికాబద్ధంగా సాధించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం 15 లక్షల టన్నుల ఉత్పత్తిని అధిగమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఏవీ.రెడ్డి, ఇంజనీర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


