కిష్టాపూర్‌ విద్యార్థికి రూ.2లక్షలు నగదు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

కిష్టాపూర్‌ విద్యార్థికి రూ.2లక్షలు నగదు పురస్కారం

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

జన్నారం: గత విద్యా సంవత్సరం ఎస్సెస్సీ ఫలితాల్లో 600 మార్కులకు గాను 582 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన మండలంలోని కిష్టాపూర్‌ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని, రేండ్లగూడ గ్రామానికి చెందిన లసెట్టి శ్వేతకు రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా రూ.2 లక్షలతోపాటు ప్రశంసాపత్రం అందజేశారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ చేపట్టిన ‘చదువుకో తెలంగాణ‘ కార్యక్రమంలో భాగంగా శ్వేతను ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నగదు పురస్కారం, ప్రశంసాపత్రం అందజేశారు. విద్యార్థినిని జిల్లా విద్యాశాఖ అధికారి పి.చంద్రయ్య, మండల విద్యాధికారి బి.రాజేందర్‌, గ్రామ సర్పంచ్‌ వాసాల నరేష్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా రాజన్న, ఉపాధ్యాయుడు దాముక కమలాకర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement