బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

వాంకిడి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆ త్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమాన గ్రా మానికి చెందిన బండె మల్లక్క (75) కొంతకాలంగా బీపీ, షుగర్‌తో బాధపడుతోంది. ఇటీవల ఆమె కాలుకు గాయంకాగా షుగర్‌ కారణంగా ఎంతకు మానడం లేదు. ఆస్పత్రిలో చూపించగా కాలు తొలగించాల్సి వస్తుందని వైద్యులు సూచించారు. దీంతో ఆందోళనకు గురైన వృద్ధురాలు గురువారం తెల్లవారు జామున సవారీల బంగ్లా వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మనవరాలు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement