● విద్య, వైద్యంలో అగ్రగామి ● ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం ● ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ● ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజా పాలన ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలోనే జిల్లా విద్య, వైద్యంలో ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు వందనం చేసి జాతీయగీతం ఆలపించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఆరో గ్యం, రహదారి భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ, డ్రగ్స్ నియంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువ త, క్రీడలు, మహిళలు, పర్యావరణం, వంటి అంశాలతో కూడిన కార్యక్రమాలను అందరి భాగస్వామ్య ంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పథకాల ద్వారా జిల్లాకు కలిగిన లబ్ధి, మంజూరైన నిధులు, లబ్ధిదారుల వివరాలు వెల్ల డి ంచారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కనీస వేతన మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం
ఉచిత రవాణా ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 36,34,000 మంది మహిళలకు రూ.151.90 కోట్ల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలోని నిరుపేదలకు ఇప్పటి వరకు 32,130 మందికి రూ. 54.27 కోట్లు ఖర్చు చేశాం.
గృహజ్యోతి
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1,35,422 మంది వినియోగదారులకు రూ.127.70 కోట్ల లబ్ధి చేకూరింది.
రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా
జిల్లాలోని 64,452 మంది రైతులకు రూ.540.66 కోట్లు రుణమాఫీ చేసింది. రైతుభరోసా పథకం ద్వారా 2026–27 వానాకాలం పంటల సాగుకు 1,55,351 మంది రైతులకు రూ.199.77 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. రైతు బీమా పథకం ద్వారా గతేడాది 284 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.14.20 కోట్లు చెల్లించాం.
ధాన్యం కొనుగోలు
యాసంగి సీజన్‌లో 334 కొనుగోల ద్వారా 35,676 మంది రైతుల నుంచి 1,97,522 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రూ.468 కోట్లు రైతుల ఖాతా ల్లో జమ చేశాం. సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున 139 మంది రైతులకు రూ.49,29,000 బోనస్ చెల్లించాం.
ఇందిరమ్మ ఇళ్లు
జిల్లాలో ఇప్పటి వరకు 10,320 ఇళ్లు మంజూరు కాగా 8,514 గ్రౌండింగ్ చేశాం. 1,635 ఇళ్లు బేస్‌మెంట్, 905 స్లాబ్ లెవల్, గోడలు పూర్తి కాగా, 2,428 ఇళ్లు స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. 2,456 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.194.28 కోట్లు జమ చేశాం.
రేషన్ కార్డులు
జిల్లాలో 2,57,251 రేషన్‌కార్డు లబ్ధిదారులకు నెలకు 14,502 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. నూతనంగా 40,465 రేషన్ కార్డులు జారీ చేశాం. జలసిరిలో భాగంగా 467 పంట కుంటలు, 295 ఊట కుంటలు, 3,352 ఇంకుడు గుంతలు, 218 బోర్‌వెల్ రీచార్జీ మంజూరయ్యాయి.
విద్యాశాఖ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యా సంవత్సరం 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యం నిర్ధేశించగా 45,542 మందిని చేర్పించి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 32 గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.21.20 కోట్లు మంజూరు చేశాం. ఒక్కొక్కటి రూ. 200 కోట్ల చొప్పున దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, చెన్నూర్ మండలంలోని సోమనపల్లి, బెల్లంపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణం చేపట్టాం. వృత్తి విద్య శిక్షణకు రూ.42.50 కోట్ల వ్యయంతో జిల్లాలో 4 అడ్వానన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేశాం.
ఉపాధి కల్పన
టాం–కాం సంస్థ ద్వారా మందమర్రిలో 75 మంది నిరుద్యోగ యువతకు జర్మనీ భాషపై శిక్షణ అందించాం. 14 జాబ్ మేళాల ద్వారా 182 మంది నిరుద్యో గ యువతకు వివిధ సంస్థల్లో ఉపాధి కల్పించాం.
వైద్యరంగం
జిల్లా కేంద్రంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ ఆస్పత్రి, రూ.129.25 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం. చెన్పూర్‌లో 100 పడకల ఆస్పత్రికి రూ.32.15 కోట్లు, లక్సెట్టిపేటలో రూ.8.50 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లాలో రూ.3.60 కోట్లతో వ్యయంతో చేపట్టిన మందుల నిలువ గిడ్డంగి భవనం పూర్తయినట్లు తెలిపారు.
తెలంగాణ తల్లి
వేషధారణలో చిన్నారి
ఇందిరా మహిళా శక్తి పథకం
ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా ముగ్గురు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువ గల సంచార చేపల విక్రయ వాహనం 60 శాతం రాయితీతో మంజూరు చేశాం. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు 16 బస్సులతో పాటు జిల్లా మహిళా సమాఖ్యకు 1 బస్సు మంజూరు చేశాం. 8, 817 స్వయం సహాయక సంఘాలకు రూ.23.90 కోట్ల వడ్డీలేని రుణాలు, ఒక్కో మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షల చొప్పున 269 భవనాలకు నిధులు మంజూరు చేశాం. ఇందిరా మహిళా మైనార్టీ శక్తి పథకం కింద చెన్పూర్ నియోజకవర్గానికి 365 యూనిట్లు, మంచిర్యాల నియోజకవర్గానికి 210 యూనిట్లు, బెల్లంపల్లి నియోజకవర్గానికి 175 యూనిట్లు మంజూరు చేశాం.
మున్సిపాలిటీలు
రాష్ట్రంలోనే అత్యుత్తమంగా మంచిర్యాలలో ‘మహాప్రస్థానం’ నిర్మించాం. భూగర్భ కేబులింగ్, భూ గర్భ మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటుకు రూ.78 కోట్లు మంజూరు చేశాం. చెన్పూర్ మున్సిపల్ పరిధి లో రూ.42 లక్షల వ్యయంతో 4 స్వచ్ఛ ఆటోట్రాలీలు కొనుగోలు చేశాం. అమృత్ 2.0 పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు రూ.306 కోట్లు మంజూరు చేశాం.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
మంచిర్యాలఅగ్రికల్చర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చూపరులను అలరించాయి. దేశభక్తి గీతాలపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ప్రాచీన కళలు, మల్లయుద్ధాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
మంచిర్యాలక్రైం: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య జాతీయ జెండా అవిష్కరించారు. అనంతరం వందేమాతర గీతం ఆలపించి జాతీయ జెండాకు వందనంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య దినోత్సవ వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీపీ ఎగ్గడి భా స్కర్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ప్రకాష్ జాతీ య జెండా ఆవిష్కరించారు. సీఐ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సీఐ హన్నన్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
అటవీశాఖ కార్యాలయంలో..
జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో సీసీఎఫ్‌వో శాంతారాం జాతీయజెండా ఆవిష్కరించారు. జిల్లా అటవీశాఖ అధికారి రాహూల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్‌వోలు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. నగరంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఎకై ్స జ్ సీఐ గురువయ్య జెండా ఆవిష్కరించారు.


