కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి | - | Sakshi
Sakshi News home page

కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి

Aug 16 2026 12:09 AM | Updated on Aug 16 2026 12:09 AM

మందమర్రిరూరల్‌: పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదుట పాత సీఐఎస్‌ఎఫ్‌ క్యాంపస్‌ ఆవరణలో ఈ నెల 22న ప్రారంభం కానున్న కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి వీరయ్య, జిల్లా సెకండ్‌ జూనియర్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి నిరోషా, ఎకై ్సజ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కృష్ణతేజ, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలసి శనివారం పరిశీలించారు. జీఎంతో పాటు సంబంధిత అధికారులను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కోర్టు ఏర్పాటైతే మందమర్రి సర్కిల్‌ పరిధిలోని కేసులు సత్వరం పరిష్కారం అవుతాయన్నారు. ఆయ న వెంట మంచిర్యాల బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, పలువురు న్యాయవాదులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement