ప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

Aug 16 2026 12:09 AM | Updated on Aug 16 2026 12:09 AM

● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు

● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజలకు మరింత పారదర్శకంగా, అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ట్యాంపర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలులో స్మార్ట్‌ కార్డులు కీలకంగా మారనున్నాయన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు వందమందికి అందిస్తున్నామన్నారు. జిల్లాకు నూతనంగా 40,456 రేషన్‌ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. డీసీపీ ఎ.భాస్కర్‌, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, కనీస వేతనాల బోర్డు చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం, మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్లా రమ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement