కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించాలి

Aug 16 2026 12:09 AM | Updated on Aug 16 2026 12:09 AM

జన్నారం: ఏజెన్సీ ఏరియాలో కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్‌ చేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర శనివారం జన్నారం మండలంలోని కవ్వాల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సర్వాయిపాపన్న గౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వృత్తిదారులకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏజెన్సీలోని గీత కార్మికులకు వర్తించడం లేదన్నారు. గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్‌, ప్రమాదానికి గురైన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. సర్వాయిపేట, తాటికొండ ఫిలాసపురం కిలాషాపురం కోటలను పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు జయరాములు, జిల్లా అధ్యక్షుడు కాసారపు లచ్చాగౌడ్‌, మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలసాని శ్రీనివాస్‌గౌడ్‌, గౌడ సంఘం మండల అధ్యక్షుడు మూల భాస్కర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పోడేటి రవి గౌడ్‌,

తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement