● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది విధి నిర్వాహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు రమేశ్, నాగేంద్రగౌడ్, ప్రవీణ్‌కుమార్, రవీందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


