ఉత్తమ ఉద్యోగులు వీరే.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఉద్యోగులు వీరే..

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

జైపూర్‌/రుద్రంపూర్‌: జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు(ఎస్టీపీపీ)కు చెందిన ముగ్గురు, సింగరేణి సంస్థలో కంపెనీ వ్యా ప్తంగా 12 ఏరియాల నుంచి 16మంది ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఎస్టీపీపీకి చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ మెరుగు రాజ్‌కుమార్‌, సింగరేణి ఏరియాల నుంచి గజ్జల రాజయ్య(కన్వేయర్‌ ఆపరేటర్‌, బెల్లంపెల్లి ఏరియా), ఎం.మల్లేష్‌(కోల్‌ కట్టర్‌, మందమర్రి ఏరియా), ఎస్‌.సదానందం(ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌, శ్రీరాంపూర్‌ ఏరియా), మేరుగు రాజ్‌కుమార్‌(సీనియర్‌ అసిస్టెంట్‌, ఎస్టీపీపీ) తదితరులు ఉత్తమ సింగరేణియన్‌గా ఎంపికయ్యారు. శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే వేడుకల్లో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్‌జ్యోతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం, సన్మానం అందుకోనున్నారు. ఎస్టీపీపీలో జరిగే వేడుకల్లో సీనియర్‌ అసిస్టెంంట్‌ లక్కోజు బాలసుబ్రహ్మణ్యం, వార్డ్‌ అసిస్టెంట్‌ అడ్డూరి కిరణ్‌కుమార్‌ ఉత్తమ ఉద్యోగులుగా సన్మానం పొందనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement