మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. ప్రభుత్వ శాఖల, పోలీసు కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించే వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ఉదయం 9.30గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో సాధించిన పలు అభివృద్ధి పనుల ప్రగతిని వివరిస్తారు. వివిధ పథకాల్లో ఎంపికై న లబ్ధిదారులకు పథకం ఫలాలను అందిస్తారని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్య, పశు సంవర్థక, మిషనల్ భగీరథ, గ్రామీణ నీటి పారుదల తదితర శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేడుకల అనంతరం మధ్యాహ్నం 2గంటలకు రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తారని తెలిపారు.
90మందికి ప్రశంసాపత్రాలు
జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి న ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రెవెన్యూ, పౌరసరఫరాల, సంక్షే మ, రవాణాశాఖ, వి ద్య, వైద్యారోగ్యశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర 24శాఖల్లోని 90మంది ఉద్యోగులు ప్రశంసాపత్రాలు అందుకోనున్నారు.
ప్రభుత్వ సలహాదారుకు కలెక్టర్ స్వాగతం
నస్పూర్: వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ప్ర భుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావుకు సీసీసీ సింగరేణి గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి కలెక్టర్ కుమార్ దీపక్ స్వాగతం పలికారు. ఆయన వెంట డీసీపీ ఏ.భాస్కర్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్ సంతోష్ పాల్గొన్నారు. కాగా, వేదిక ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
వేణుగోపాల్‌రావుకు మొక్కను అందజేస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్
కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక


