హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివా రణలో స్వీయ అవగాహన ప్రతీ ఒక్కరికి అవసరమ ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌రాథోడ్‌ అన్నారు. రెండు నెలల విస్తృత ఐఈసీ ప్రచారం నిర్వహణకు శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘నాకో స్వీయ ప్రమా ద అంచనా’ క్యూఆర్‌ కోడ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ నెల 12నుంచి అక్టోబర్‌ 12వరకు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలతోపాటు వ్యూహాత్మక ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ సందేహాల నివృత్తికి జాతీయ టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ 1097 వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, దిశ సీపీఎం నీలిమ, సీఎస్‌వో రాజేశ్‌, డీఎండీఓ సంతోష్‌, టీఐ స్నేహ, పీఎం పవన్‌, డీపీవో ప్రశాంతి, ఎల్‌బ్ల్యూఎస్‌ సూపర్‌వైజర్‌ శ్రీకాంత్‌, డీపీసీ టీబీ సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement