పరీక్షల్లో మంచి మా ర్కులు, ర్యాంకులు రా వాలని తల్లిదండ్రులు ఇతర పిల్లలతో పోలు స్తూ తమ పిల్ల లను చులకన చేసి మాట్లాడడంతో చిన్నారులు మానసిక క్షోభకు గురవుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల మనసెరిగి మాట్లాడాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. వారిని కించపరిచేలా మాట్లాడవద్దు. – రంగు వేణుకుమార్,
సైకాలజిస్ట్, మంచిర్యాల
కౌన్సెలింగ్ ఇప్పించాలి
12 నుంచి 19 ఏళ్ల మధ్య శారీరకంగా, మానసికంగా పరపక్వత లేకుండా ఉంటారు. ప్రతీ అంశంలోను థ్రిల్లింగ్‌ను కోరుకుంటారు. ఈ కారణంగానే డ్రగ్స్, ఇతర వ్యసనాలకు బానిసవుతారు. ఇలాంటి వారి రోజువారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. తల్లిదండ్రులు మార్పును గమనించి మానసిక వైద్యనిపుణులచేత కౌన్సిలింగ్ ఇప్పించాలి
– హైమా, షీటీం ఎస్సై, మంచిర్యాల


