మంచిర్యాలటౌన్: అమరుల త్యాగ ఫలితం వల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, వారి త్యాగాలను మరువలేమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో కలిసి గురువారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, కొయ్యల ఏమాజి, దుర్గం అశోక్, గోలి రాము, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.


