జైపూర్: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి మండలంలోని ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్‌ను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆహ్వానించారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించడం, చెరువులు, కుంటల్లో నీటికుంటలు నిర్మించడం ఫలితంగా భూగర్భ నీటిమట్టం పెరగడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో ముదిగుంట గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రధాని మోదీ అభినందించడంతో రాష్ట్ర గవర్నర్ నుంచి సర్పంచ్‌కు ఆహ్వానం అందింది.


