● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
నస్పూర్: శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. గురువారం శ్రీరాంపూర్ పోలీసుస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి పట్టుబడిన వాహనాలను క్రమపద్ధతిలో అమర్చాలని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్‌కు గల కారణాల, ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టు తదితర అంశాలపై సీఐ ఆకుల అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ
నస్పూర్: ఫిర్యాదులను చట్టపరిధిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బందితో సమస్యలు, విధులపై తెలుసుకున్నారు. సీఐ రవీందర్ పాల్గొన్నారు.


