ఏటా కంబాల కుంట కింద పొలాల్లో వరి సాగు చేస్తున్న. పో యిన నెల వరకు వా నలు లేక కుంటలకు నీళ్లు రాలేదు. నారు అలికినా వానలు లేక నాట్లు వేసుకోలేదు. వారం కిందట కురిసిన భారీ వర్షాలకు కుంట నిండింది. ఇప్పుడు నాట్లు వేసుకున్న.
– బీమరాజుల రాజేష్, నెన్నెల
ఆరుతడి పంటలే మేలు..
ప్రస్తుతం కురిసిన వర్షాలతో వరిసాగు చేసుకుంటే రానున్న రోజుల్లో నీటితడులకు ఇబ్బందులు తప్పవు. తక్కువ నీటితో 60 నుంచి 90 రోజుల్లో దిగుబడి వచ్చే ఆరుతడి పంటలు, కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. తొందర పడి వరిసాగు చేసి నష్టపోవద్దు.
– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి


