భీమారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రా థమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలు తెలుసుకున్నా రు. ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి వైద్యశిబి రాలు నిర్వహించాలని ఆదేశించారు. 14ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా ఇప్పించాలని సూచించారు. వైద్యాధికారి వంశీకృష్ణ, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో నాందేవ్ తదితరులున్నారు.


