మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీ వో, పోలీస్ అధికారులు సమన్వయంతో కృషి చే యాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బుధవారం కమిషనరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ఆర్టీవో, పోలీస్ అధికారులతో రోడ్డు ప్రమాదాలపై సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రోడ్డు భద్రతా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇసుక, బొగ్గు, యాష్ తరలించే వాహనాలపై తప్పనిసరిగా టార్పాలిన్లు కప్పాలని సూచించారు. నిబంధనలు పాటించని డ్రైవర్లపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులు, విద్యార్థులను తరలించరాదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. హె ల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు, సీట్ బెల్ట్ ధరించకుండా ఇతర వాహనాలు నడపడం, వాహనాల పై నంబర్ ప్లేట్ లేక పోవడం, మైనర్లతో వాహనా లు నడిపించడం, నిర్లక్ష్య (ర్యాష్) డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లాంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై రాజీ లే కుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. అనంతరం రహ్–వీర్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీటీవో గోపీకృష్ణ, ట్రాఫిక్ సీఐలు రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్, ఎండీ హన్నన్, ఎంవీఐలు పాల్గొన్నారు.


