అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలి

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ ● కలెక్టర్‌, అధికారులతో సమీక్ష

చెన్నూర్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి సూచించారు. చెన్నూర్‌ పట్టణంలో మంత్రి బుధవారం మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జి ల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చే యాలని సూచించారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అమృత్‌ 2.0 పనులు చేపడుతున్నామని తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని అ ధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యార్థం సో లార్‌ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడాలని తెలిపారు. 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏ ర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పుష్కర ఘాట్ల నుంచి చేపట్టిన రోడ్లు, సుందరీకరణ పనులు అన్ని శాఖలు సమన్వయంతో పూర్తి చేసేలా చూడాలని సూచించారు.

కొమురంభీమ్‌ విగ్రహావిష్కరణ

జైపూర్‌: మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమురం భీమ్‌ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి బు ధవారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క మ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అధికా రులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులున్నారు.

పీఏసీఎస్‌ ఏర్పాటు చేయాలని వినతి

భీమారం: మండల కేంద్రంలో పీఏసీఎస్‌ను ఏర్పా టు చేయాలని రాష్ట్ర మంత్రి వివేక్‌ను బుధవారం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు జైపూర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు పొడేటి రవి, భీమారం, దాంపూర్‌ సర్పంచులు ఉస్కమల్ల విజయలక్ష్మి, చేగొండ కొమురయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement