నువ్వుల పంటను సాగుచేసే రైతులు నేలలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పంట వేశాక తగిన యాజమాన్య పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పంట పుష్పించే దశలో తేమ ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవాలి. సజ్జలు విత్తుకున్నాక మొలకల తర్వాత అవసరమైన మొక్కల సంఖ్యను కొనసాగించేలా గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి. వర్షపాతం ఆధారంగా ఎంపిక చేసుకున్న పంటల తేమ సంరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, పురుగు, వ్యాధుల సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలు తగ్గించుకోవచ్చు.


