సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నామినేటెడ్ పదవుల భర్తీ ప్రకటనతో మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర స్థాయి పదవుల భర్తీ త్వరలో చేపట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరులోగా 50నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి మరోసారి అవకాశం ఉంటుందా..? ఉండదా..? అనేది వారి పనితీరు ఆధారంగా నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా నుంచి ఎవరికై నా రాష్ట్ర స్థాయి పదవి దక్కుతుందా.. అని నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నాయకులతోపాటు యువత, మహిళ, కార్మిక వర్గాలకు చెందిన సీనియర్ నాయకులు అనేకమంది అవకాశం కోసం గంపెడాశలతో ఉన్నారు. దీంతో తమకు అవకాశాలు ఉంటాయా అని చర్చ సాగుతోంది. ఈ క్రమంలో జిల్లా నాయకులకు పదవుల్లో స్థానం కల్పించేలా స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి చొరవ చూపాలని కోరుతున్నారు. ఇప్పటికే తమ బయోడేటాను గాంధీభవన్‌కు పంపించి ఎదురుచూస్తున్నారు. ఇక చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కొందరు సీనియర్లు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని పార్టీని వీడారు.
● పదవులపై కాంగ్రెస్ నాయకుల ఆశలు ● పోస్టుల భర్తీలో గతంలో నిరాశ ● ఈసారి నియామకాల్లో అవకాశాలపై కేడర్‌లో చర్చ
Jul 17 2026 3:22 AM | Updated on Jul 17 2026 3:22 AM
● పదవులపై కాంగ్రెస్ నాయకుల ఆశలు ● పోస్టుల భర్తీలో గతంలో నిరాశ ● ఈసారి నియామకాల్లో అవకాశాలపై కేడర్‌లో చర్చ
Advertisement


