
‘స్థానిక’ సమరానికి సన్నద్ధం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తాజాగా గురువారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాల గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) వెంకటేశ్వర్‌రావు ఓటరు జాబితా సవరణలో నిమగ్నమయ్యారు. గురువారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. 29న జిల్లా స్థాయిలో, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 28, 29, 30వ తేదీల్లో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి 31న పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 2న తుది జాబితాను ప్రకటిస్తారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,76,669 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లా వివరాలు
మండలాలు.. 16
గ్రామ పంచాయతీలు 306
వార్డులు 2,680
మహిళా ఓటర్లు 1,91,011పురుష ఓటర్లు 1,85,643
ఇతర ఓటర్లు 15
మొత్తం ఓటర్లు 3,76,669
బ్యాలెట్ బాక్సులు 4,278